చలో నిజామాబాద్ కు పిలుపునిచ్చిన నరేంద్ర మోడీ సభ నిర్మల్ నియోజకవర్గం ఇంచార్జ్ వర్గంటి రామ్మోహన్ గౌడ్.
మెదక్ ప్రజా బలం న్యూస్ :-
అక్టోబర్ 3 మంగళవారం రోజున భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ రానున్న సందర్భముగా నిర్మల్ నియోజకవర్గం నిర్మల్ టౌన్ బిజెపి ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసిన సన్నాహాక సమావేశంలో మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారి సభని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చిన బిజెపి మెదక్ పార్లమెంట్ కన్వినర్ (మోడీ గారి సభ నిర్మల్ నియోజకవర్గం ఇంచార్జ్) వర్గంటి రామ్మోహన్ గౌడ్ . అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కూడా రాబోయే రోజుల్లో మన ప్రభుత్వమే పాలిస్తుందని మన బిజెపి పార్టీ అధికారంలోకి రావడానికి మన వంతు కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి శ్రేణులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.