మహాత్మా గాంధీకి నివాళులర్పించిన మంత్రి పువ్వాడ

 

ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 2 (ప్రజాబలం) ఖమ్మం భారత జాతిపిత మహాత్మాగాంధీ 154వ జయంతి సందర్భంగా ఖమ్మం నగరం త్రీ టౌన్ గాంధీ చౌక్ నందు గాంధీజీ విగ్రహానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ ప్రజల స్వేచ్ఛా వాయువుల కోసం గాంధీజీ చేసిన అలుపెరగని పోరాటం ఎందరికో స్ఫూర్తినిచ్చిం దన్నారు అహింసా మార్గంలో దేన్నైనా జయించవచ్చని నిరూపించిన గాంధేయ మార్గంలోనే కేసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యకాంక్షకు అనుగుణంగా తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ పాలన సాగుతోందని, మహాత్ముడి ఆశయ స్ఫూర్తికి అనుగుణంగా పల్లెలను ఆర్దికంగా పరిపుష్టం చేస్తున్నామని మంత్రి అన్నారు. దేశానికి గాంధీజీ అందించిన సేవలు సదా స్మరనీయమని మహాత్మునికి మంత్రి జోహార్లు అర్పించారుఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, సత్యాగ్రహమే ఆయుధంగా అహింస, శాంతి మార్గంలో దేశానికి స్వాతంత్య్ర సముపార్జన చేసిన మహనీయులు మాహాత్మాగాంధీ అని కొనియాడారు. వారు చూపిన మార్గంలో పయనించి, దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లాలని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, కార్పొరేటర్ పసుమర్తి రాంమోహన్, ఖమ్మం ఆర్డీవో జి. గణేష్, అర్బన్ తహసీల్దార్ సిహెచ్. స్వామి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking