15 రాష్ట్రీయ, 3 జాతీయ అవార్డులు
ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 2 (ప్రజాబలం) ఖమ్మం నగరానికి చెందిన మిమిక్రీ కళాకారుడకు ఏసియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్ ఆపిల్ ఎమోషన్ హోసూరు యూనివర్సిటీ వారు తమిళనాడు ప్రభుత్వము నుండి డాక్టరేట్ అవార్డును అందజేశారని మిమిక్రీ కళాకారుడు డాక్టర్ దామెర దయాకర్ స్వామి తెలిపారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎంతో ఇష్టంగా స్వయంగా సాధన చేసి ప్రారంభించిన మిమిక్రీ కళను ప్రప్రదమంగా 10వ తరగతిలో ప్రారంభించి ఉపాధ్యాయుల ద్వారా ప్రోత్సాహాన్నీ, మన్ననలను పొందానని తెలిపారు. డాక్టర్ వేణుమాధవ్ చేస్తున్న మిమిక్రీని చూస్తూ.. స్వీయ సాధనచేసి రాష్ట్రస్థాయిలో 15 అవార్డులు జాతీయస్థాయిలో మూడు అవార్డులు అందుకున్నట్లు ఆయన తెలిపారు. గత 30 సంవత్సరాలుగా మిమిక్రీ కళకు పూర్తిస్థాయి సమయం కేటాయించి ఎన్నో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలను సైతం పక్కనపెట్టి మిమిక్రీని సాధన చేశానని తెలిపారు. కానీ నేడు కళాకారులకు ప్రోత్సాహం కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. కళాకారులకు ఉన్నత స్థాయిలో గుర్తింపు రావడంలేదని, ప్రతిభగల కళాకారులను గుర్తించి ప్రభుత్వం సహకరించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో భోగా గిరి, వనం అప్పాజీ, వడ్డే రామారావు పాల్గొన్నారు.