తేది: 02.10.2023
నాటి తెలంగాణ ఉద్యమం నుండి మొదలుకొని నేటి బంగారు తెలంగాణ వరకు రాష్ట్ర ప్రభుత్వ౦ అమలు చేసినటువంటి ఎన్నో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించటంలో ప్రభుత్వానికి వెన్ను ముక్కలాగా రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగులం ప్రభుత్వానికి అండగా నిలిచాము.
కరోన,వరదల వంటి విపత్కర పరిస్థితులలో కుడా మేము మా కుటుంబాలకు దూరంగా ఉంటూ రాత్రింబవళ్ళు పనిచేశాము. కాని స్వరాష్ట్రం సాదించు కున్న కూడా ఇంకా బానిసత్వం, శ్రమ దోపిడీ నుంచి విముక్తి కాలేదు, వెట్టి చాకిరి చేస్తున్నాము కాబట్టి ఇకనైనా అన్ని ప్రభుత్వ శాఖలలో విధులు నిర్వహిస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు క్యాబినెట్ మీటింగ్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఎందరో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను బలి తీసుకుంటున్న ఏజెన్సి వ్యవస్థని తక్షణమే రద్దు చేసి రేగులరైస్ చేయాలనీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. మాయొక్క పనిని గుర్తించి (VRA,VRO,Electricity,RTC,SERP, etc.) లాగానే ప్రభుత్వంలో విలీనం చేయాలనీ ఈ వేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడమైనది.
తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వరంగాలలో,శాఖలలో,సంస్టలలో పనిచేస్తున్న 1,50,000 వేల ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ(గ్రామ స్తాయి నుంచి మొదలు కొని రాష్ట్ర స్తాయి వరకు ) వారి పై ఆధార పడ్డ సుమారు 6,00,000 ల కుటుంబాలకు జరగబోయే క్యాబినెట్ మీటింగ్ ద్వారా న్యాయం చేస్తారని ఎదురు చూస్తున్నాము, పై అంశం చర్చకు రావాలని అలా కానిచో మా కార్యాచరణను మరింత ఉదృతం చేస్తామని ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియ చెస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జే.ఏ..సీ. పిలుపు మేరకు సోమవారం రోజు హైదరాబాద్ లో నిర్వహించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ప్రెస్ మీట్లో రాష్ట్ర౦లోని వివిధ జిల్లా కోఆర్డినేటర్లు మరియు జే.ఏ.సీ సభ్యులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్స్ :-
• మూడు సంవత్సరాల కాలపరిమితి పూర్తియిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తక్షణమే రెగ్యులర్ చేయాలి.(శాంక్షన్ పోస్ట్, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్ పెండిచర్ & తదితర గ్రాంట్ ల ద్వారా పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల అందరినీ).
• మూడు సంవత్సరాల కాలపరిమితి లోపు ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకి ఏజెన్సిలను రద్దు చేసి, ప్రభుత్వమే నేరుగా ప్రభుత్య ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలి.
• రాష్ట్రంలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తులందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేయాలి.
• రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5.00 లక్షల ఆర్ధిక సహాయం చేస్తూ, వారి కుటుంబలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి.
• ఒక్క ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని కూడా తొలగించకూడదు. ఉద్యోగులను ఇష్ట రీతిన బదిలీలు చేయకూడదని జేఏసీ నాయకులు రాజీ రెడ్డి, శ్రీధర్, జగదీష్, ఎండీ రాజ్ మహ్మద్, సంతోష్, గోవర్థన్, విజయలక్ష్మి, సునీత, సంధ్య, నాజర్ , యాదయ్య డిమాండ్ చేశారు.