తెలుగుదేశం పార్టీ ఖమ్మం నగర అధ్యక్షులు వడ్డేo విజయ్
ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 02 (ప్రజాబలం)ఖమ్మం జిల్లా లో జరిగినకేటీఆర్ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ లేదని పోలీసు యంత్రాంగం తో తప్పుడు సమాచారం తెలుగుదేశం పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు ఇచ్చి వారి నమ్మించి విగ్ర ఆవిష్కరణ ను అతి తక్కువ జనాభాతో పూలమాలలు లేకుండా అన్నదానం లేకుండా దేశంలో ఎన్టీఆర్ విగ్రహం ఎక్కడ ఇంతవరకు ఈ విధంగా ఆవిష్కరణ లేదు అధికార పార్టీ ఏ అంగు ఆర్భాటం లేకుండా ఇలా చేయడం అన్న ఎన్టీఆర్ ని అవమానించడం జరిగింది ఇలా దొంగతనంగా తప్పుడు సమాచారం ఇచ్చి చేయాల్సిన అవసరం ఏముంది దీనివలన మీ బిఆర్ఎస్ పార్టీకి మంచి కంటే ఎక్కువ చెడు జరిగిందని ఖమ్మం ప్రజలు అనుకుంటున్నారు టిఆర్ఎస్ పార్టీ వాళ్లు అభివృద్ధి కార్యక్రమాలను అంటూ ఓపెనింగ్ చేసిన వాటినే మరల మరల చూసుకుంటూ మేము ఎక్కువ అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నామని చెప్పుకోవటం విడ్డూరంగా ఉంది అని అన్నారు అంతే కాకుండా మీరు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి వస్తున్నప్పుడు మిగతా ప్రతిపక్ష రాజకీయ పార్టీ ముఖ్య నాయకుల్ని అరెస్టు చేయాల్సిన అవసరం ఏముంది ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు త్వరలోనే జరగబోయే ఎలక్షన్లలో సరైన నిర్ణయం తీసుకొని సరైన సమయంలో ప్రజలు స్పందిస్తారని వడ్డేo.విజయ్ అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర ప్రధాన కార్యదర్శులు ప్యారిస్ ఎంకన్న ,గుండపిన్ని నాగేశ్వరావు మరియు నగర డివిజన్ అధ్యక్షులు పెద్దినేని రామారావు ,ఎర్రం జేమ్స్, ఉన్నం శీను వాయిగాని బిక్షపతి ఎస్వీ రమణ సత్యనారాయణ గొర్రె ముచ్చు రాజు తదితరులు పాల్గొన్నారు