ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 2 (ప్రజాబలం) ఖమ్మం తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మెన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి సమక్షంలో ఖమ్మం నగరానికి చెందిన పారా సాయిఉదయ్ కిరణ్ తో పాటు అతని యూత్ సభ్యులు సుమారు 200మంది పొంగులేటి క్యాంపు కార్యాలయంలో సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కండువా కప్పి వారిని పార్టీలోకి పొంగులేటి ఆహ్వానించారు ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ యువతకు ప్రాధాన్యత కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి నిరుద్యోగ యువకునికి ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. అధికారం చేపట్టిన అనతి కాలంలోనే బ్యాక్ లాగ్ పోస్టులన్నింటిని భర్తీ చేస్తామన్నారు. పార్టీలో చేరిన పారా సాయిఉదయ్ కిరణ్ తో పాటు అతని అనుచరులకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ గెలుపే ధ్యేయంగా యువకులందరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం యూత్ సభ్యులు పొంగులేటిని భారీ గజమాలతో ఘనంగా సత్కరించారు.