ప్రపంచానికి స్ఫూర్తి ప్రదాత మహాత్మా గాంధీ డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్

 

 

ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 02 (ప్రజాబలం) ఖమ్మం దాదాపు 200 సంవత్సరాల పాటు భారతదేశాన్ని పరిపాలించి, మన దేశ సంపదను కొల్లగొట్టిన సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అహీంసా యుత మార్గంలో వెళ్లగొట్టి దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టి న మహానుభావుడు మహాత్మా గాంధీజీ అని, ఎన్నో దేశాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచిపోయారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రధాన అనుచరుడు, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ కొనియాడారు పండితాపురంలోమహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ
సూర్య చంద్రులు ఉన్నంతవరకు భారతదేశానికి మహాత్మా గాంధీ జాతిపితగా నిలిచిపోతారని, గాంధీజీ చేసిన క్విట్ ఇండియా, ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణ లాంటి కార్యక్రమాల ద్వారా దేశానికి విముక్తి తెచ్చి పెట్టారని, గాంధీజీత్యాగం సేవలు ఈ దేశం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుందని, స్వాతంత్ర్య అనంతరం ఎలాంటి పదవీకాంక్ష లేకుండా నిస్వార్థమైన జీవితం గడిపారని, అంటరానితనం నేరమని, దళితులను హరిజనులని నినదించి న మహా వ్యక్తి మహాత్మా గాంధీజీ అని మల్లి బాబు యాదవ్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎల్ హెచ్ పి ఎస్ మండల అధ్యక్షులు భూక్యా నాగేంద్రబాబు, మత్స్య శాఖ సొసైటీ అధ్యక్షులు మేకల మల్లికార్జునరావు, మొగిలి ముత్తిలింగం, బానోత్ వీర నాగులు , బాధావత్ నాగరాజు, భూక్య బీరన్న తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking