లక్షెట్టిపేట మండల రిపోర్టర్ నవంబర్ 09 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన SEEEPC 2024 సర్వే లో భాగంగా అదనపు కలెక్టర్(రెవెన్యూ) సబావత్ మోతిలాల్,మంచిర్యాల లక్షెట్టిపేట పురపాలక సంఘము పరిధిలోని పలు వార్డులలో పర్యటించడం శనివారం జరిగినది.ఇందులో భాగంగా వివరములు సేకరిస్తున్న ఎన్యుమరేటర్స్ సిబ్బందిని పలు విషయముల గురించి అడిగి,వారికి తగు సూచనలు ఇవ్వడం జరిగినది.ఈ కార్యక్రమములో మున్సిపల్ కమిషనర్ కల్లెడ రాజశేఖర్,తహసిల్దార్ దిలీప్ కుమార్, కార్యాలయ మేనేజర్ టీ రాజశేఖర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.