రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 9 నవంబర్ 2024
మణికొండ మునిసిపాలిటీ అంతర్గతంగా పుప్పాలగూడ గ్రామంలోని మాజి సర్పంచ్ సునీతా రాజ్కుమార్ ఇంట్లో మణికొండ భారత రాష్ట్ర సమితి నాయకుల కార్యకర్తల సమావేశం స్థానిక పార్టీ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ్ల అధ్యక్షతన శనివారం రోజున నిర్వహించడం జరిగింది. బీ.ఆర్.ఎస్ పార్టీ కార్య కర్తల సమావేశంలో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంతో పాటు పలు ప్రజా సమస్యలు చర్చకు వచ్చాయి, ఇదే సందర్భంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రతిమలు ఏర్ప్పాటు చేయడానికి తీర్మణించగా కార్యకర్తల స్పందన గమనించి భారతదేశ రాజ్యాంగం నిర్మించిన నవంబర్ 26 న 75 వ సంవత్సరం పురస్కరించుకొని, స్మరించుకొని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పుప్పాలగూడ గవర్నమెంట్ స్కూల్ పక్కన అంబేద్కర్ భవన్ శంకుస్థాపన జరిగిన చోట ఒకటి, రెండవది తానాషా హుడా కాలనీ అంబేద్కర్ పార్క్ వద్ద విగ్రహ ప్రతిష్ట కొరకు పార్టీ కార్య కర్తల అభిప్రాయాన్ని లిఖిత పూర్వకంగా మున్సిపల్ కమిషనర్ గారికి అనుమతి కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ నవీన్ కుమార్, కుంబగళ్ల ధనరాజ్, రూపా రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు గుట్టమీది నరేందర్, గోరుకంటి విఠల్, ప్రకాశ్, ముత్తంగి లక్ష్మయ్య, అందె లక్ష్మణ్ రావు, బొమ్మూ ఉపేందర్నాథ్ రెడ్డి, యాలాల కిరణ్, షేక్ ఆరిఫ్, బాబు రావు, సుమన్, రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, కీర్తీ లతా గౌడ్, సుమ, టైగర్ రేఖ, మంజు, ప్రవీణ్, శ్రీబాబు, గణేష్, సంతోష్, రమేష్, జై, అశోక్, బబ్లూ, శ్రీనివాస్, మహేందర్, అరవింద్ తది తరులు పాల్గొన్నారు.