గ్రేటర్ పరిధిలో ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో ‘సమగ్ర కుటుంబ సర్వే’ 

– రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దాన కిషోర్
సచివాలయం 08, నవంబర్ 2024:
గ్రేటర్ పరిధిలో ‘సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే’ ను షెడ్యూల్ ప్రకారం, ఖచ్చితత్వం, క్వాలిటీతో చేపట్టేందుకు GHMC, జోన్ ల పరిధిలో సమన్వయ, పర్యవేక్షణ అధికారులను
రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దాన కిషోర్ నియమించారు.

ఈ మేరకు శనివారం ఆయన మెమో జారీ చేశారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) లో నిర్వహించే
సామాజిక, ఆర్థిక,విద్య, ఉపాధి, రాజకీయ, కుల (‘సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే’) సర్వే సమన్వయ అధికారి గా హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ సర్ఫరాజ్ అహ్మద్ ను నియమించారు.

అలాగే జీహెచ్‌ఎంసీ పరిధిలోని
సికింద్రాబాద్ , చార్మినార్ జోన్ లకు
హెచ్‌ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ శ్రీవత్స కోట, L.B నగర్ , ఖైరతాబాద్ జోన్ లకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఉప కార్యదర్శి ప్రియాంక,
సేరిలింగంపల్లి , కూకట్‌పల్లి జోన్ లకు జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
మయాంక్ మిట్టల్ లను పర్యవేక్షణ అధికారులుగా నియమించారు.

పర్యవేక్షణ అధికారులు సంబంధిత జోనల్ కమీషనర్‌లతో సర్వే సమన్వయం చేసుకుంటూ క్షేత్ర స్థాయిలో సర్వే సకాలంలో ప్రభావవంతంగా పూర్తి అయ్యేలా చూస్తారు.
క్షేత్రస్థాయి సర్వే పురోగతికి సంబంధించి GHMC సమన్వయ అధికారి కి తెలియజేస్తారు.

జోనల్ కమిషనర్లు , మానిటరింగ్ అధికారులను సమన్వయం చేసుకుంటూ
గ్రేటర్ పరిధిలో ప్రభుత్వ నిర్ధేశిత షెడ్యూల్ ప్రకార సర్వే సజావుగా జరిగేలా GHMC కమిషనర్‌ కు సమన్వయ అధికారి సర్ఫరాజ్ అహ్మద్ సహకారం అందిస్తారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking