రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 8 నవంబర్ 2024
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన కుల గణన సర్వేకు వ్యతిరేకం అసలు కాదని దళిత గిరిజన వెనుక బడిన తరగతులకు లబ్ధి పొందే విధంగా ఉంటే బాగుంటుందని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన కుటుంబ సర్వే పేరిట రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురి చేయడమే కాకుండా ఈ ప్రక్రియ ఎందుకు చేస్తున్నారో ఎవరికి అర్థం కావడంలేదని, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన 6 గ్యారంటీల ఉసెత్తకుండ ఈ సర్వే మాత్రం భారత దేశానికే రోల్ మాడల్ గా నిలుస్తుందని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు నాయకుడు రాహుల్ గాంధీ చెప్పడం విడ్డూరంగా ఉందని ది సిటిజన్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు అందె లక్ష్మణ్ రావు తన వ్యక్తిగత అభిప్రాయంగా తెలియ పరుస్తూ, భారత రాజ్యాంగం లోని షెడ్యూల్ 7 జాబితా 1 లోని ఎంట్రీ 69 ప్రకారం కార్య నిర్వాహక అధికారాలను నిర్ణయించేది మరియు సెన్సస్ చట్టం 1948 ప్రకారం భారత యూనియన్ యొక్క కేంద్ర ప్రభుత్వానికి, పార్లమెంటుకు మాత్రమే జనాభా లెక్కల అధికారాన్ని కలిగి ఉన్నదనీ కావున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కుల గణన సర్వేకు చట్టబద్ధత లేదని, ఇట్టి సర్వే లోని విస్తృతమైన ప్రశ్నావళితో తెలంగాణా పౌరుల గోప్యతా హక్కును ప్రభావితం చేస్తు, ఇప్పటి వరకు వ్యక్తిగత వివరాలు బయట పెట్ట నటువంటి విశయాలైన, ఎవరికి ఎంత భూమి ఉంది, ఎన్ని ఆస్తులు కలిగి ఉన్నారని, రాజకీయ పదవులు అనుభవించిన వివరాలు వంటి విషయాలు అడుగు తున్నారంటే దీని వెనుక ఏదో కుట్ర దాగున్నట్లు అనిపిస్తుందని పై పెట్చు సేకరించిన వివరాలన్నింటిని గోప్యంగా ఉంచుతామని నమ్మబల్కడం ఎంత వరకు సబబొ సదరు అధికారులే తెలియ జేయాలని, నిజంగా కుల గణన పేరిట బీ.సీ లకు గాని ఎస్సీలకు గాని ఎస్టీలకు గాని ఏమైనా మేలు చేయాలను కుంటే కులం ఏమిటి, రేషన్ కార్డు ఉందా, ఇప్పటికే తెల్ల కార్డు ద్వారా ఏదైనా పథకం పొందు తున్నారా, గ్యాస్ కనెక్షన్ ఉందా, కులవృత్తుల వారు అయితే ప్రభుత్వం ద్వారా ఏమన్నా సాయం పొందారా, ప్రభుత్వ పథకాల ద్వారా లాభాలు పొందుతున్నారా, సొంతం ఇల్లు ఉందా, ప్రభుత్వ ఉద్యోగం ఉందా ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారా లేక వ్యాపారమా అనే వాటిని అడిగితే ఒక బీ.సీ బిడ్డగా స్వాగతిస్తానని కానీ పూర్తి స్థాయిలో ఒక నేరస్తుని వివరాలు తెలుసుకునే విధంగా, కోర్టులో సాక్షా ధారాలు నిరూపించ డానికి తీసుకునే విధంగా అవసరం లేని విషయాలు కూడా తెలుసు కోవడంలో మర్మమేమిటో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ చట్టం ప్రకారం జనాభా లెక్కలను నిర్వహిస్తుందో రాష్ట్ర ప్రజలకు మీరు సేకరిస్తున్న వివరాల ద్వారా ఏమి మేలు చేస్తారో సవివరముగా తెలియ పరుస్తూ ముందుకు సాగాలని, తత్ద్వార లేనియెడల తెలంగాణ రాష్ట్ర పథకం యొక్క సర్వే పేరుతో ఫారమ్ నింపడం, సమాచారం ఇవ్వడం తప్పని సరి అని అను కోవడం లేదని, ఇట్టి సర్వే జనాభా లెక్కల పరిగణన చట్టం కిందకు రాదని దరిమిలా చట్టం మరియు జరిమానాలు ఇట్టి సర్వేకు వర్తించవని కౌన్సిల్ సభ్యులు అందె లక్ష్మణ్ రావు తన వ్యక్తిగత అభిప్రాయంగా తెలియ పరిచినారు.
Prev Post