నాంపల్లి ప్రజాబలం ప్రతినిధి:టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో శనివారం పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు.బీఆరెస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారిలో నాగర్ కర్నూల్ నియోజకవర్గం బిజినేపల్లి మండలానికి చెందిన పలువురున్నారు.
కాంగ్రెస్ సర్పంచులు వెంకటస్వామి, అమృత్ రెడ్డి, తిరుపతయ్య, ఎంపీటీసీ అంజి, మాజీ సర్పంచులు అలియా నాయక్, రాంచందర్, మాజీ ఎంపీపీ రాములు, వార్డు సభ్యులు, కార్యకర్తలున్నారు.
వీరిని జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో కందువాకప్పి పార్టీలోకి రేవంత్ ఆహ్వానించారు.