రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి ఆగస్టు 19:
జిల్లా వ్యాప్తంగా 497 మందికి మైనారిటీబంధు చెక్కుల పంపిణీ,
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరి సంక్షేమానికి కట్టుబడి అనేక పథకాలు అమలు చేస్తోందని అందులో మైనారిటీలకు సంబంధించి వివిధ సంక్షేమ పథకాలతో వారి ఆర్థికాభ్యున్నతికి చేయూతనిస్తోందని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
శనివారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్తో కలిసి మైనారిటీ బంధు కింద అర్హులైన 497 మంది మైనారిటీలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరి సంక్షేమం, అభ్యున్నతికి పాటుపడుతూ వారిని ఆర్థికంగా ఎదిగేందుకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో గొప్ప వ్యక్తి ఉన్న వారని ఆయన మంచి ఆలోచనతో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాటిని అర్హులందరికీ అందేలా చేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. మైనారిటీల కోసం లక్ష రూపాయల ఆర్థికసహాయంతో వ్యాపారాలు చేసుకొని ఆర్థికంగా ఎదగాలని ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ మైనారిటీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగేందుకు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం అందించే లక్ష రూపా ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలకు, వారి సంక్షేమానికి అనేక రకాల పథకాలను ప్రవేశపెట్టి వారికి అందేలా చేయడంతో పాటు ఆసరా పెన్షన్లు, షాదీముబారక్, రంజాన్ పండగకు కొత్త బట్టలు, విదేశాల్లో (ఓవర్సీస్)లో ఉన్నత చదువులు చదివే మైనారిటీ విద్యార్థిని విద్యార్థులకు రూ.20 లక్షల వరకు ఆర్థిక సహాయం అందచేసి వారిని ఇతర దేశాల్లో చదివించే అవకాశం కల్పించారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. అలాగే మైనారిటీ విద్యార్థులను గురుకుల పాఠశాలలో చదివిస్తే రూ.1.25 (ఒక్క లక్ష ఇరవై ఐదు వేలు) ఇస్తున్నారని వాటిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఈ సందర్భంగా కోరారు. అలాగే మున్ముందు కూడా వారి అభ్యున్నతికి వివిధ పథకాలలో భాగస్వాములను చేసి ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నాని దీనిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలోని ప్రభుత్వాలు మైనారిటీలను కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణించాయి తప్పించి వారి సంక్షేమానికి, వారి ఆర్థిక ఎదుగుదలకు ఏమాత్రం పట్టించుకోలేదని మంత్రి సమావేశంలో తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీలకు అన్ని రంగాల్లో అవకాశం కల్పిస్తున్నారని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు.
అనంతరం జిల్లా పరిషత్ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మైనార్టీల అభివృద్ధికి, సంక్షేమానికి కట్టబడి ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం మైనారిటీ బంధు కింద లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందచేస్తోందని ఇది ఎంతో శుభపరిణామమని దీనిని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతినిత్యం ముఖ్యమంత్రి పేదల సంక్షేమానికి కృషి చేస్తారని జడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100% సబ్సిడీతో మైనారిటీల కోసం ఆర్థిక సహాయ పథకాన్ని ప్రవేశ పెటింది అని జిల్లా వ్యాప్తంగా మైనారిటీబంధు కింద అర్హులైన వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందచేయడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం 497 మందికి ఆర్థిక సహాయం చెక్కులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే ఈ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ అమోయ్ కుమార్ కోరారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి, అభిషేక్ అగస్త్య, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ఖాసిమ్, కమిటీ సభ్యులు, మైనారిటీలు, ప్రజాప్రతినిధులు ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.