అంగవైకల్యం ఉందనే భావన మనస్సులో నుంచి తొలగించి విజయాలు సాధించాలి

 

రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి

దివ్యాంగులకు ఉచిత సహాయ ఉపకరణాలు మోటరైజ్డ్ వేకిల్స్, బ్యాటరీ ఛైర్, ల్యాప్టాప్, స్మార్ట్ఫోన్, లు అందచేసిన మంత్రి మల్లారెడ్డి, జెడ్ పి చైర్మన్ ,శరత్ చంద్ర రెడ్డి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి ఆగస్టు 19: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఆవరణలో మహిళా, శిశు, వికలాంగులు, వయో వృద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం కింద రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి, అర్హులైన 17 మంది దివ్యాంగులకు మోటరైజ్ వేకిల్స్, ఒకరికి బ్యాటరీ వీల్ ఛైర్, ఒకరికి ల్యాప్టాప్, ఒకరికి స్మార్ట్ఫోన్ లను అందించారు. దివ్యాంగులు తమకు అంగవైకల్యం ఉందనే భావనను మనస్సులో నుంచి తొలగించి వారికంటూ ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దాన్ని సాధించేందుకు అందరితో పాటు సమానంగా కృషి చేయాలని ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వారికి ఎంతో చేయూతనిస్తూ భరోసా కల్పిస్తోందని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా దివ్యాంగుల సంక్షేమానికి జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వాహనాలు, ఇతర పరికరాలు అందచేయడం జరిగిందన్నారు. దివ్యాంగులు అందరితో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమములో లో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ,జిల్లా
సంక్షేమఅధికారి కృష్ణరెడ్డి, ప్రజాప్రతినిధులు ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking