తహసిల్దార్ కు వినతి పత్రం అదజేత

 

కమ్యూనిటీ భవనానికి స్థలం కేటాయించాలి

మాల సంఘం నాయకులు గరిసే రవీందర్

ప్రజాబలం లక్షెట్టిపేట మండల రిపోర్టర్ నవంబర్ 19 : లక్షెట్టిపేట తహసీల్దార్ కు వినతిపత్రం అందజేత
మాలల కోసం మాలల కోసం కమ్యూనిటీ భవనానికి స్థలం కేటాయించాలని మాల మహానాడు మండల అధ్యక్షులు గరిసే రవీందర్ కోరారు.పట్టణంలో మాల మహానాడు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం మాల సంఘం భవనంకు స్థలం కేటాయించాలని తాసిల్దార్ కు వినతి పత్రం ఇవ్వడం అందజేశారు.ఈ సందర్భంగా మాల కులస్తులతో కలిసి అయన మాట్లాడుతూ…మాల సంఘంలో 351కుటుంబాలు కలిగి ఉన్నాయని, ఇప్పటివరకు కూడా కుల భవనం లేక శుభకార్యాలకు, పంచాయతీలు చేసుకోవడానికి భవనానికి స్థలం లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. గత నాయకులకు ఎన్నోసార్లు విన్నవించుకోవడం జరిగిందని అయినా ఎలాంటి ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మహాలక్ష్మి వాడలో గల మిషన్ భగీరథ పక్కన ఉన్న గవర్నమెంట్ స్థలంలో మాకు 3,గుంటలు స్థలం కేటాయించగలరని కోరారు.ఈ కార్యక్రమంలో పెండెం రాజు,గరిసె రవీందర్, మినుముల శాంతి కుమార్,వేణు, నరసయ్య,పెద్ద లింగయ్య,శంకర్, రఘు,ముకుంది, బాపు,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking