కరీంనగర్ ప్రజాబలం ప్రతినిధి:మాజీ ప్రధాన మంత్రి, భారత రత్న శ్రీమతి ఇందిరాగాంధీ 107 వ జయతి వేడుకలు కరీంనగర్ కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ కల్లె పల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా జరిగాయి. కరీంనగర్ జిల్లా కోర్టు ఆవరణలోని ఇందిరా గాంధీ చిత్ర పటానికి లక్ష్మయ్య పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మయ్య మాట్లాడుతు ఇందిరా గాంధి భారత దేశంలో మొదటి మహిళ ప్రధాన మంత్రి గా నాలుగు టర్మ్ లు చేశారని, ఆమె సేవా లను కొనియాడారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ లీగల్ సెల్ బాధ్యులు ఆర్ దేవేందర్ రెడ్డి, రజనీష్, ఆర్ ప్రభాకర్, పి లక్ష్మణ్ రావు, బి నర్సింహ రెడ్డి, కె శంకర్, కొత్త ప్రకాశ్, సీనియర్ న్యాయవాదులు కాసుగంటి మాధవ రావు, పి ప్రభాకర్ రావు, టి పవన్ కుమార్, పి ప్రభాకర్ రావు, కె సంజీవ్ రెడ్డి, బి నర్సింహ రెడ్డి, చక్రధర్, లక్ష్మన్ రావు, పి రాజన్న, గోపాల్ రెడ్డి , ఎస్ సత్యం తదితులున్నారు.