సిరిసిల్ల ప్రజాబలం ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో జాతీయ చేనేత దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. పాత బస్టాండ్ వద్ద ఉన్న చేనేత విగ్రహానికి పూల మాలలు వేసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ రa, సన్మానం చేశారు. అనంతరం బీవై నగర్లోని షాది ఖానాలో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని చేనేత వస్త్రాలు ధరించి నేత కార్మికులను ఆదుకోవాలని ప్రతిజ్ఞ చేశారు.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేసి, త్రిప్ట్ పథకం కింద 2 కోట్ల 64 లక్షలు 62 వేల రూపాయల చెక్కులను కార్మికులకు పంపిణీ చేశారు. నేత కార్మికులను సన్మానించిన సందర్భంగా ఆది శ్రీనివాస్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, ‘‘రాష్ట్ర ప్రభుత్వం చేనేత, మర మగ్గాల రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలని కృత నిశ్చయంతో ఉంది. చేనేత కార్మికుడు మర మగ్గం కార్మికుడిగా మారి ఉపాధి పొందుతున్నారు. చేనేత రంగం సంక్షోభంలో ఉన్నపుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సిరిసిల్ల వచ్చి వారిని ఆదుకున్నారు. మా ప్రభుత్వం ఏర్పడిన తరువాత మూడు నెలల సమయం పట్టింది, ఎన్నికల కోడ్ రావడంతో పాలనపై దృష్టి పెట్టలేకపోయాం, ఇప్పుడు మాత్రం పాలనపై పూర్తిగా దృష్టి సారించాం.
నేత కార్మికులకు ప్రభుత్వ ఆర్డర్ తప్పకుండా ఇస్తాం. నేత కార్మికులు దీక్ష చేసినప్పుడు ప్రభుత్వం మీ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నాం. చేనేత రంగంలో బిటెక్ చదివిన విద్యార్థులకు ఉపాధి కల్పిస్తాం. అపరల్ పార్కులో ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. త్వరలో మంత్రుల బృందం సిరిసిల్లలో పర్యటిస్తుంది. టెక్స్టైల్ సంబంధించి 4 కోట్ల 52 లక్షలు విడుదల చేసాం, మిగతా డబ్బులు కూడా త్వరలో విడుదల చేస్తాం.
మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త టెక్నాలజీ, ఆలోచనలతో పోటీ ప్రపంచంలో సిరిసిల్ల పరిశ్రమ నిలదొక్కుకోవాలని మా ప్రభుత్వం కృషి చేస్తుంది. వచ్చే చేనేత దినోత్సవం వరకు కొత్త పుంతలతో నిలదొక్కుకోవాలని కోరుకుంటున్నాను.’’
ఈ వేడుకలు సిరిసిల్లలో చేనేత వృత్తికి కొత్త ఉత్తేజం నింపాయి. ప్రజలు మరియు నేత కార్మికులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు…