హైద్రాబాద్ లో ఆదిలాబాద్ రంజన్లు

 

ప్రజాబలం ప్రతినిధి ఉప్పల్ నియోజకవర్గం ఏప్రిల్ 04:
రంజన్లు అంటేనే ఆదిలాబాద్ ఆదిలాబాద్ అంటేనే రంజన్లు ఎన్నో సంవత్సరాలుగా అదిలాబాద్ కుమ్మర్లు తయారు చేసే మట్టి పాత్రలో అతి ప్రాముఖ్యత సంతరించుకున్న మట్టి పాత్ర రంజన్, అక్కడ లభించే మట్టిలో నీటిని చల్లబరిచి నీటిలో ఉన్న మలినాలను శుద్ధి చేసే యొక్క గొప్ప గుణం ఆ మట్టిలో ఉన్నది కాబట్టి ఆ మట్టితో చేసిన రంజన్లలో నీళ్లు ఆరోగ్యకరంగా, చల్లదనంగా మరియు రుచికరంగా ఉంటాయి. తెలంగాణలో అదిలాబాద్ రంజన్లను మించిన రంజన్లు ఇంతవరకు రాలేదని చెప్పుకోవాలి, తెలంగాణలో చాలా చోట్ల రంజాన్ లు చేస్తున్నారు అటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా చేస్తారు కానీ అదిలాబాద్ రంజన్లంటే వాటికి ఉన్న ప్రాముఖ్యతనే వేరు తెలంగాణ బిసి వెల్ఫేర్ శాఖ వారి ఆధ్వర్యంలో అదిలాబాద్ నుంచి రంజాన్లను కుమ్మర్లు తీసుకొచ్చి శిల్పారామంలో స్టాల్ పెట్టి రంజలను విక్రయించడం జరుగుతుంది. దానిని పూర్తిగా బీసీ వెల్ఫేర్ శాఖనే చూసుకుంటుంది దీనికి తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుమ్మరి బాలకృష్ణ ప్రజాపతి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking