రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 4 ఏప్రిల్ 2025
బి.ఆర్.ఎస్ పార్టీ స్థానిక నాయకులు గుడ్ మార్నింగ్ మణికొండ పేరిట ప్రజాబిప్రాయ సేకరణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజున లాలమ్మ గార్డెన్స్ పరిసర ప్రాంతాలలో సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానికులు వెల్లబుచ్చిన అభిప్రాయాలు. ఈ మధ్యకాలంలో పెరిగిన ఇంటి పన్ను విధానాన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. పైగా ఆ.ర్టి.ఐ ద్వారా ప్రభుత్వ అధికారిక ఆర్డరు లేదా సవివర అంశాలను అడిగినను సరియైన సమాచారం ఇవ్వకపోగా ఏ ఆధారము పరిగణలోకి తీసుకొని కొంత మందికి ఆస్తి పన్ను పెంచి మరి కొంతమందికి పెంచక పోవడం విడ్డూరమని, అడిగితే మున్సిపాలటి అధికారుల నుంచి స్పందన లేదని ఆవేదన తెలియజేశారు. ఆస్తిపన్ను కట్టడానికి ఎవరూ వ్యతిరేకం కాదు కానీ పెంచిన విధానాన్ని ప్రతి ఒక్కరు దుయ్య బడుతున్నారు. రోడ్ల నిర్మాణం చేపట్టినప్పుడు డ్రైనేజీ వ్యవస్థ సరిగలేదని, అందుకు భిన్నంగా ఏర్పరిచిన కారణంగా మరియు ఈ ప్రాంతంలో చిన్న స్థలంలో పెద్ద ఇండ్లు ఉన్న కారణంగా తరచూ డ్రైనేజీ సమస్య తలెత్తు తున్నదనీ వాపోయారు. ఈ ప్రాంతంలో మంచి నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నదనీ మరియు వీరికి హైదరాబాద్ వాటర్ వర్క్స్ వారి ట్యాంకర్స్ సదుపాయం కూడా సరిగ్గా లేదని తెలుపుతు ఈ కారణంగా ప్రైవేట్ ట్యాంకర్ల మీద ఆధారపడుతున్నామని తెలిపారు. వాహన దారులు ఇక్కడి పెద్ద రహదారిపై అతివేగముగా వెళుతున్న దరిమిలా సదరు రహదారిను దాటడానికి వయోజనులు పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కావున ఇక్కడ రహదారీపై జీబ్రా క్రాసింగ్ పెట్టడం ఎంతైనా అవసరం ఉన్నదనీ స్థానికులు తెలిపినారు. షేక్ పేట నుంచి పుప్పాలగూడ మీదగా వెళ్లే ఆర్టీసీ బస్సులు బస్టాండ్ వద్ద నిలుపుతున్నారు కానీ పుప్పాలగూడ మీదుగా షేక్పేట్ వెళ్లే బస్సులను ఆపడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తపరిచారు. పై విషయాలలో సంబంధిత అధికారులు స్పందించి స్థానికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భారత రాష్ర్ట సమితి మణికొండ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ, కుంభగల్ల ధనరాజ్, అందే లక్ష్మణ్ రావు, బుద్ధోలు బాబు, సంఘం శ్రీకాంత్, గోరుకంటి విఠల్, శ్రీనివాస్ చారి, దిలీప్, యాలాల కిరణ్, భాను చందర్, సుమనళిని, బొడ్డు శ్రీధర్, తిరుపతి, బాలాజీ, రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
