హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌ డైరీ 2025 ఆవిష్కరించిన

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి:ఏప్రిల్‌ 04:ప్రెస్‌ క్లబ్‌ హైదరాబాద్‌ 2025 సంవత్సరపు నూతన డైరీ ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తన క్యాంప్‌ కార్యాలయం లోశుక్రవారం నాడు విడుదల చేశారు.ప్రెస్‌ క్లబ్‌ హైదరాబాద్‌ అధ్యక్షులు ఎల్‌.వేణుగోపాలనాయుడు, ప్రధాన కార్యదర్శిఆర్‌.రవికాంత్‌ రెడ్డి,ఉపాధ్యక్షులు కె.శ్రీకాంత్రావు,సంయుక్త కార్యదర్శి చిలుకూరి హరిప్రసాద్‌,కార్యవర్గ సభ్యులు బ్రహ్మండభేరి గోపరాజు,పి.బాపురావు,టి.శ్రీనివాస్‌ తదితరులు డైరీ ఆవిష్కరణలో పాల్గొన్నారు.జర్నలిస్టుల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వం లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాగ్రెస్‌ ప్రభుత్వమే జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తుందని భట్టి తెలిపారు.ప్రెస్‌ క్లబ్‌ కు స్థలాన్ని కేటాయించాలని అధ్యక్ష ,ప్రధానకార్యదర్శులు,పాలకమండలి ఉపముఖ్యమంత్రి ని కోరారు. ప్రభుత్వంనుంచి ప్రెస్‌ క్లబ్‌ కు ముఖ్యంగా జర్నలిస్టులకు పూర్తి సహాయసహకారాలు అందిస్తామని భట్టి హామీనిచ్చారు.సామాజిగూడా లోని ప్రెస్‌ క్లబ్‌ కు
ప్రస్తుత స్థలం కేటాయింపు కోసం ఉపముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.ఈ సందర్భంగా ప్రెస్‌ క్లబ్‌ పాలకమండలి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కి పూల మొక్కను బహూకరించి శాలువాతో సత్కరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking