హెచ్ సి యు విద్యార్థులను తప్పుదోవ పట్టించి, బిఆర్ఎస్, బిజెపి నేతలు పెనం పై రొట్టెలు కాల్చుకుంటున్నారు.
సిరిసిల్ల ప్రెస్ మీట్ లో టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ రవితేజ గౌడ్.
రాజన్న సిరిసిల్ల, ( ప్రజాబలం ), కంచ గచ్చిబౌలి భూముల పై వివాదం సృష్టించి హెచ్ సి యు విద్యార్థులను తప్పుదోవ పట్టించి బిఆర్ఎస్, బిజెపి పార్టీలు పెనం పై రొట్టెలు కాల్చుకుంటున్నారని పిసిసి లీగల్ సెల్ కన్వీనర్ రవితేజ గౌడ్ అన్నారు.
పర్యావరణం గురించి కేటీఆర్ మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయి అనిపిస్తుంది అన్నారు.
హైదరాబాద్ మహానగరానికి మంచినీటిని అందించే జంట జలాశయాలను కాపాడే జీవో నెంబర్ 111 నీ ఎత్తివేసి ఎకరానికి100 కోట్ల రూపాయల చొప్పున వేలం వేసిన సర్కార్ మీది కాదా అని ప్రశ్నించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మీ నియోజకవర్గంలో విచ్చలవిడిగా గుట్టలు తవ్వుతూ మట్టి మాఫియా చేసిన విధ్వంసానికి అండగా నిలిచింది ఎవరు అని ప్రశ్నించారు.
ప్రజలు, విలేకరులు నెత్తి నోరు మొత్తుకున్న రాత్రింబవళ్లు అడ్డగోలుగా మట్టి తవ్వకాలు చేపట్టింది ఎవరి అనుచరులు, ఎవరు బినామీలో కేటీఆర్ స్పష్టం చేయాలన్నారు.
అగ్రహారం ప్రధాన రోడ్డుకు ఆనుకొని పచ్చగా హరితవనంల ఉన్న గుట్టని ఎర్రటి తివాచీల మార్చింది మీరు కాదా అని ఆయన ప్రశ్నించారు.
పనికిరాని కాలేశ్వరం బ్యారేజ్ కట్టి మహారాష్ట్ర, చత్తీస్గడ్ బార్డర్ లో ఎంత అడవికి నష్టం చేశారు మీకు తెలియనిది కాదు కదా అన్నారు.
మలకపేట రిజర్వాయర్ నిర్మాణం కోసం ఎన్ని కోట్ల చెట్లు నరకారో మీకు తెలుసు కదా అన్నారు.
పర్యావరణానికి ఎంతో విధ్వంసం చేసి నేడు ముసలి కన్నీరు కారుస్తున్న కేటీఆర్ కు ఆస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువే అనిపిస్తుంది అన్నారు.
మూడు విశ్వవిద్యాలయంలో చదువుకున్న వ్యక్తిగా, విశ్వవిద్యాలయానికి కేటాయించిన భూమి కబ్జాకు గురి అయితే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు అన్నారు.
కేయూ, జేఎన్టీయూ, ఓయూలలో గత ప్రభుత్వాలలో ఎకరాల కొద్ది భూమి కబ్జా కాబడింది అన్నారు.
గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఓయూ భూములను లాక్కునే ప్రయత్నం చేసి విఫలమైంది. విద్యార్థులు వ్యతిరేకిస్తున్న బలవంతంగా ఓయుకు సంబంధించిన భూమిలో నుండి రోడ్డు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు.
నేడు హెచ్ సి యు కు సంబంధం లేని భూమిని ప్రభుత్వం రాష్ట్ర అవసరాల దృష్ట్యా వినియోగించదలిస్తే, అనవసరంగా రాజకీయం చేస్తున్నారన్నారు.
వాట్సాప్ యూనివర్సిటీ, బిఆర్ఎస్ స్టూడియోలలో గ్రాఫిక్ డిజైన్లు తయారు చేసి లేని నెమళ్లను, జింకలను పెట్టి, ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేయడం సరి అయింది కాదు అన్నారు.
2024 గ్లోబల్ రిస్క్ రిపోర్టులో తప్పుడు సమాచారం మరియు సరియైన సమాచారం ఇవ్వకపోవడం ఫేక్ న్యూస్ సంబంధిత విషయంలో మన దేశం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. కావున నిజా నిజాలు ఏంటో నిర్ధారించుకున్నాకే ప్రజలు సోషల్ మీడియా సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయాలని కోరుతున్నాను అన్నారు.
బిజెపి, బిఆర్ఎస్ పార్టీలో ఎండు చూసి గోపాలం పాడుతున్నాయని, మా ప్రజా ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంటుందని ఒక పకృతి ప్రేమికుడుగా నాకు బలమైన విశ్వాసం ఉంది అన్నారు.
ప్రచార కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, స్టేట్ లీగల్ సెల్ కన్వీనర్ బుర్ర రవితేజ గౌడ్ ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సెల్ చైర్మన్ ఇరుకుల అశ్విన్, స్పోక్స్ పర్సన్ భగవాన్ రాజేష్, జాయింట్ కన్వీనర్ తిరుపతి, సుహాసిని, జ్యోతి, రాకేష్, కమలాకర్, విశాల్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.