చిర్రకుంట గ్రామంలో సన్న బియ్యం పంపిణీ

 

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ ఏప్రిల్ 3 :

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం మందమర్రి మండలంలోని చిర్రకుంట గ్రామంలో చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశానుసారం అధికారులు చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మందమర్రి మండల తహాసిల్దార్ సతీష్ కుమార్, మండల అభివృద్ధి అధికారి రాజేశ్వర్ లు పాల్గొన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గందె రాంచందర్, మాజీ సర్పంచ్ ఒడ్నాల కొమురయ్యల ఆధ్వర్యంలో ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామిల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పెద్దాల రాజయ్య, దుర్గం సుధాకర్, సంపత్ రావు, అత్తి పోశయ్య లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking