రాజ్యాంగాన్ని కాపాడుకుందాం
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముద్దసాని వేణు
ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ ఏప్రిల్ 04 : ఏఐసీసీ పిలుపు మేరకు మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాలా సురేఖ ఆదేశానుసారం కొర్విచెల్మ గ్రామంలో ప్రజలు అవగాహన.శుక్రవారం ఈ సందర్భంగా ముద్దసాని వేణు మాట్లాడుతూ… దండేపల్లి మండలం లోని కొర్విచెల్మ గ్రామంలో జై బాపు…జై భీమ్…జై సంవిధాన కార్యక్రమం లో భగంగా,స్వాతంత్ర భారత దేశాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్నీ కాపాడుకుందాం ప్రజలకు అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మొటపలుకుల గటయ్య, మాజీ సర్పంచ్ మాన్కు,సీనియర్ నాయకుడు కారుకురి సత్తయ్య,మల్యాల చంద్రమౌళి,పిసారి సత్తయ్య,రాదేని బాపు, యువ నాయకుడు ముత్తె వేంకటేష్,గొపతి తిరుపతి, సుద్దపల్లి వేంకటేశ్వర్లు, కమలాకర్ రాఘుపతి, రవి,గోవర్ధన్,సాయి కిరణ్,కొర్విచెల్మ గ్రామంలోని నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.