ప్రజల బాగోగులు,పేదరిక నిర్మూలనకు అహర్నిశలు కృషి చేస్తా  

 

      న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ ఘనంగా సన్మానం

హైదరాబాద్ మార్చ్ 17 :సికింద్రాబాద్,  రసూల్ పుర  గంగపుత్ర సంఘం  కార్యాలయంలో  గంగపుత్ర సంఘం  ఆధ్వర్యంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం  రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్, రక్షక్ దళ్ చైర్మన్  ఉదయ్ కుమార్, గంగపుత్ర సంఘం అధ్యక్షులు  బైరి ఎల్లయ్యలను   గంగపుత్ర సంఘం ఆద్వర్యలో   ఘనంగా శాలువా  పూలగుచ్చంతో  సన్మానించారు. ఈ సందర్భంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్  మాట్లాడుతూ  ప్రజల బాగోగుల కోసం,  పేదరిక నిర్మూలన కోసం,  గ్రామాల అభివృద్ధి కోసం,  సంఘాల అభివృద్ధి కోసం , ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దడం కోసం,  ఫ్రీడమ్ ఫైటర్  కోవూరి మొగులయ్య గౌడ్  మెమోరియల్ ట్రస్ట్  ఎప్పుడు ముందుంటుందని  అదేవిధంగా  ప్రజా సమస్యల  పరిష్కారం కోసం  అలుపెరుగని పోరాటం  చేయడానికి  జాతీయ బీసీ సంక్షేమ సంఘం  ఎప్పుడు ముందుంటుందని  తెలియజేస్తూ  అనుబంధ సంస్థలతో  ఎప్పుడు కలిసి  ప్రజా సమస్యల నిర్మూలన కోసం పోరాడుతుందని  తెలియజేశారు. గంగపుత్ర సంఘంతో పాటు  అన్ని కుల సంఘాల వారి  అభివృద్ధి కోసం ,  ప్రజా సమస్యల  పరిష్కారం కోసం   ఉపయోగిస్తాడని  అహర్నిశలు కష్టపడతాడని అందుకు తనపై  గంగపుత్ర సంఘం  వారు ఉంచిన నమ్మకాన్ని  గౌరవించి  గంగపుత్ర సంఘం ఎదుగుదలకు ,కార్యాలయ అభివృద్ధికి తోడ్పడతానని తెలియజేశారు.  అదేవిధంగా  రక్షక్ దళ్ చైర్మన్  ఉదయ్ కుమార్  గంగపుత్ర సంఘం వారి  అభివృద్ధికోసం  తన వంతు బాధ్యతను కర్తవ్యాన్ని నెరవేరుస్తానని ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలియజేశారు.  ఈ సందర్భంగా  గంగపుత్ర సంఘం అధ్యక్షులు  బైరి ఎల్లయ్య  మాట్లాడుతూ  మా యొక్క గంగపుత్ర సంఘం  సంక్షేమం  కోసం , అభివృద్ధి కోసం  ముందుకు వచ్చినందుకు ,  మాకు అండగా నిలిచినందుకు  ప్రత్యేకంగా  గంగపుత్ర సంఘం నుండి  హృదయపూర్వక  అభినందనలు  తెలియజేస్తున్నానని  సంఘం సభ్యుల సమక్షంలో  తెలియజేశారు.ఈ యొక్క కార్యక్రమంలో గంగపుత్ర సంఘం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking