-కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతి
ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 6 :
సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో సోమవారం మందమర్రి జిఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు మెమోరండం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్బర్ ఆలీ, బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, దాగం మల్లేష్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్, మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి జెట్టి మల్లయ్య లు హాజరై మాట్లాడుతూ సింగరేణిలో 33 వేల మంది పైచిర్రుకు కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారని కాంట్రాక్టు కార్మికులు శ్రమదోపిడికి గురవుతున్నారని సెప్టెంబర్ 2022లో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమ్మె సందర్భంగా యాజమాన్యం అంగీకరించిన పలు డిమాండ్లను నేటికీ అమలు పరచడంలో యాజమాన్యం వైఫల్యం చెందిందన్నారు. కోల్ ఇండియాలో అమలవుతున్న హై పవర్ కమిటీ వేతనాలను కాంట్రాక్టు కార్మికులకు చెల్లించాలని అప్పటివరకు జీవో నెంబర్ 22 వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు ఈఎస్ఐ వైద్య సౌకర్యం అందించాలని, మైన్స్ యాక్ట్ ప్రకారం ప్రతి కార్మికునికి లీవులు సిక్కులు, పండుగలు సెలవులు ఇవ్వాలని కోరారు. అండర్ గ్రౌండ్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు అండర్ గ్రౌండ్ అలవెన్స్ ఇవ్వాలని, ఆప్సేటిజం పేరిట కార్మికుల నుండి రికవరీ చేస్తున్న ఫైన్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. ఓసి లో పనిచేస్తున్న వాల్వో డ్రైవర్లను వోల్వో ఆపరేటర్లుగా గుర్తించి హైస్కూల్ వేతనాలు చెల్లించాలని కాంట్రాక్టు కార్మికులందరికీ సీఎం పిఎఫ్ నెంబర్లు సీఎం పిఎఫ్ చిట్టీలు ప్రతి సంవత్సరం అందజేసి సీఎం పిఎఫ్ లోన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. మిగులు క్వార్టర్లు ఉన్న ఏరియాలో కాంట్రాక్టు కార్మికులకు క్వాటర్లను కేటాయించాలని, నర్సరీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు గుర్తించి సీఎం పిఎఫ్ అమలు చేయాలని కాంట్రాక్టు కార్మికులు చేస్తున్న పనిని బట్టి సెమి స్కిల్,స్కిల్ హైస్కిల్ వేతనాలు చెల్లించాలన్నారు. కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని s &pc లో పనిచేస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు వృత్తి పన్ను రద్దుచేసి ఉచితంగా యూనిఫాం అందజేయాలని తదితర సమస్యలను యాజమాన్యం వెంటనే స్పందించి పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో , రామకృష్ణాపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఇపకాయల లింగయ్య, బోయపోతుల కొమురయ్య , రాజేష్ యాదవ్ ,ఫిట్ కార్యదర్శి రామకృష్ణ, నాయకులు నజీరుద్దీన్, గౌస్, ప్రణయ్, శ్రీను, రామ్ రెడ్డి, సతీష్, శ్రీధర్, రమేష్, గట్టు స్వామి, రాజేందర్, రియాజ్ పాషా, దుర్గం స్వామి, ఆకుల తిరుపతి, బొమ్మ కంటి తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.