ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గం రిపోర్టర్ జనవరి 6 :
మందమర్రి పట్టణంలోని పాల చెట్టు వద్ద నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇటీవల ప్రకటించిన లబ్ధిదారులకు ఈనెల 8 న సి.ఈ.ఆర్ క్లబ్ లో లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయనున్నట్లు మందమర్రి తహసిల్దార్ సతీష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈకార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్ (డబుల్ బెడ్ రూమ్) ఆద్వర్యములో లాటరీ పద్దతిన 253 మంది లబ్దిదారులను ఎంపిక చేయుటకు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.