వనదుర్గ మాత ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులుగా ఆకుల పెంటయ్య.

అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం.
జర్నలిస్టులందరూ ఐక్యతతో కలిసిమెలిసి ఉండాలి .
సీనియర్ జర్నలిస్ట్ ఆకుల పెంటయ్య.

మెదక్ ఫిబ్రవరి 8 ప్రాజబలం న్యూస్:-

మెదక్ జిల్లా ఏడుపాయలు వనదుర్గామాత దేవాలయం పుణ్యక్షేత్రం సమీపంలో వనదుర్గామాత ప్రెస్ క్లబ్ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీనియర్ జర్నలిస్ట్ వరిగుంతం గ్రామం ఆకుల పెంటయ్యను గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. సీనియర్ జర్నలిస్ట్ ఆకుల పెంటయ్యను ఘనంగా శాలువతో సత్కరించి అభినందనలు తెలిపిన అభిమానులు జర్నలిస్టులు. అనంతరం వారు మాట్లాడుతూ జర్నలిస్టులు అందరూ కలిసిమెలిసి ఉండాలని, అందరూ ఐక్యతతో ఉండాలని ప్రజా సమస్యలపై నిజాని నిర్భయంగా రాయాలని ప్రెస్ రిపోర్టర్, జర్నలిస్ట్ అనేవారు ఎవరికి తలవద్దని, ప్రజా సమస్యలను ప్రభుత్వాధికారుల , ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ప్రజా సమస్యలను వెలికితీస్తూ ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను సాధించాలని , అప్పుడే ప్రజలకు సేవలు అందుతాయని వనదుర్గ మాత ప్రెస్ క్లబ్ సభ్యులందరూ కలిసిమెలిసి ఉండాలని మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking