వారసంతలో గుత్తేదారి ఇష్టారాజ్యం…?

 

మేకల కొనుగోలుదారుల నుండి ఇష్టానుసారం సంత ఫీజు వసూలు…! చోద్యం చూస్తున్న మున్సిపల్ అధికారులు….!

డిఫాల్టర్లకి మళ్ళీ టెండర్లు ఇవ్వడం వెనుక మతలబు ఏమిటి

ఉన్నతాధికారులు విచారణ చేపడితే మరిన్నీ నిజాలు బయటకి

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 8

జమ్మికుంట పట్టణానికి వ్యాపార కేంద్రంగా జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడికి నిత్యం సుమారు వందలాది గ్రామాల ప్రజలు వివిధ అవసరాల నిమిత్తం వస్తూపోతూ ఉంటారు. అదే స్థాయిలో జమ్మికుంట పట్టణంలో వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయి. జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ప్రతి మంగళవారం నిర్వహించే వారసంత ఎప్పుడు క్రయవిక్రయాలు జరిపే వారితో రద్దీగా ఉంటుంది. వారసంతను వేలంపాట ద్వారా దక్కించుకున్న గుత్తేదారు వారసంతలో క్రయవిక్రయాలు జరిపే వారి నుంచి మున్సిపల్ నిబంధన ప్రకారం ఇంత ఫీజు వసూలు చేయాలని ఉంటుంది. కానీ ఈ సంవత్సరం వారసంతను దక్కించుకున్న గుత్తేదారు తాన ఇష్టానుసారం వారసంత ఫీజును వసూలు చేసు చేస్తుండడం పలు విమర్శలకు తావిస్తోంది. మేకలను కొనుగోలు చేసే వారికి ఇస్తున్న రసీదులలో కొన్నిటి పై మున్సిపాలిటీ కార్యాలయం ముద్ర ఉండగా మరికొన్నిటి కార్యాలయం ముద్ర లేకుండానే ఇస్తుండడం చూస్తుంటే మున్సిపల్ అధికారులు వారసంత నిర్వహణపై ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ఇట్టే అర్థమవుతుంది. మేకల కొనుగోలుదారుల నుండి సైతం గుత్తేదారు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా డబ్బులు వసూలు చేస్తుండడంపై కొనుగోలుదారులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

వారసంతలో కొనుగోలుదారులకు వినియోగదారులకు సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఇటు మునిసిపల్ అధికారులు కానీ వారసంత నిర్వాహకులు కానీ పట్టించుకోకపోవడం వలన క్రయవిక్రయాలు చేసే వారికి ఇబ్బందిగా అంతేకాకుండా సంతకు వచ్చేవారు జమ్మికుంట కోరపల్లి ప్రధాన రహదారిపై వాహనాలను ఇస్తానుసారంగా పార్కింగ్ చేయడం వల్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది ఈ విషయంపై స్పందించిన పోలీసులు మంగళవారం వారసంత సమీపంలో పార్కింగ్ చేసిన వాహనాల ప్లగ్గులు తీసివేయడం చేశారని పలువురు వినియోగదారులు తెలిపారు. అసలు వారసంత నిర్వహణకు మున్సిపల్ పరిధిలో ఎలాంటి వసతులు లేవు. ప్రతి మంగళవారం నిర్వహించే వారసంత వీణవంక రోడ్డుకు ఇరువైపులా కాకతీయ పాఠశాల సమీపంలో శివాలయం పరిధిలోని ఖాళీ స్థలంలో నిర్వహిస్తుంటారు. గొర్రెల, మేకల సంత సైతం కొంతమందికి చెందిన ప్రైవేటు పట్టా భూముల్లోనే నిర్వహణ జరుగుతుంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి వారసంత నిర్వహణ సక్రమంగా జరిగేటట్లు ఒకే వ్యక్తి ఆధిపత్యం కాకుండా మున్సిపల్ నిబంధనల ప్రకారం వారసంత నిర్వహణ జరిగేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారసంతలో క్రయవిక్రయాలు జరిపే వారు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. జమ్మికుంట వారసంత కొరకు మరో మూడు నెలల్లో టెండర్లు పిలిచే అవకాశం ఉంది ఈసారి టెండర్ల లోనైనా డిఫాల్టర్లకు బినామీలకు కాకుండా మంచి వాళ్లకు టెండర్ అప్పజెప్పాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో టెండర్లు పాడి మున్సిపాలిటీకి డబ్బులు చెల్లించకపోయిన ఆ తర్వాత సంవత్సరం కూడా బినామీ పేర్లతో డబ్బులు బాకీ ఉన్న గుత్తేదారు. మళ్లీ టెండర్ వేయగా అతనికే టెండర్ ఇవ్వడం వెనుక మతలబు ఏమిటో అర్థం కావడం లేదు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి కాంట్రాక్టర్లు డబ్బులు ఇవ్వకపోయినా మళ్లీ వారికే బినామీ పేర్లతో టెండర్లు ఇవ్వడం వెనక ఎవరి హస్తముందో విజిలెన్స్ డిపార్ట్మెంట్ విచారణ జరిపితే మరిన్ని నిజాలు బయటకు వస్తాయని మున్సిపాలిటీకి రావాల్సిన బకాయిలు తిరిగి వసూలు చేసుకునే అవకాశం ఉంటుందని పట్టణ ప్రజలు అంటున్నారు. ఇప్పుడు ఉన్న గుత్తేదారు కూడా తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ మాకు అధికారుల అండదండలు ఉన్నాయంటూ అధిక ఫీజు వసూలు చేయడం వెనుక మతలబు అర్ధం కావడం లేదు.

Leave A Reply

Your email address will not be published.

Breaking