మణికొండలో వీ ఆర్ 4 ట్రస్టు ద్వారా అలయి బలయి

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 14 అక్టోబరు 2024:
తెలంగాణ ప్రాంతంలో ప్రాముఖ్యత గల పండుగలలో ముఖ్య మయినవిగా మన్ననలను పొందుతున్న బతుకమ్మ పండుగ, దసరా నవరాత్రి ఉత్సవాలతో పాటు పవిత్ర జమ్మిచెట్టు (శమీ వృక్షం) పూజ కూడా విశిష్ఠత పొందినది. ఈ సందర్భముగా మణికొండలోనే ప్ర ప్రధమముగా, రాజకీయ పార్టీలకు అతీతంగా, భేధాభి ప్రయాలకు తావులేకుండా వీ ఆర్ 4 చారిటబుల్ ట్రస్టు ఆద్వర్యంలో స్నేహ పూర్వక ఆప్యాయతతో కూడిన ఆలింగన అలయి బలయి కార్యక్రమం మణికొండ సెక్రటేరియట్ కాలనీ లోని గోల్డెన్ టెంపుల్ రహదారిలో గల గౌతం మాడల్ స్కూలు ప్రక్కన గల శ్రీ మత్ నల్ల పోచమ్మ దేవాలయం నందు ఆదివారం రోజున స్థానిక మణికొండ మహిళా మణులచే సందడి సందడిగా ఘనంగా ఆట పాటలతో పాటు విశిష్టత గల దాండియా నృత్యాలు జరుపు కొన్నారని, ఇట్టి శుభ తరుణంలో స్థానిక భక్త జను లందరితో పాటు స్థానికేతర హితులు సన్నిహితులు అధిక సంఖ్యలో పాల్గొన్న తరుణంలో అతిథులందరికి వీ ఆర్ 4 చారిటబుల్ ట్రస్టు సభ్యులు ఇతోచితా సన్మానంతో పాటు పూర్తి తరహా సాయంత్రపు పలహారాలను వితరణ కావించడం జరిగినదని, ఇట్టి శుభ పారిణామ కార్యక్రమం ప్రతి ఏటా జరుపుకుంటూ స్నేహ భందాలను పెంపొందించు కుంటూ ముందుకు సాగుదామని, ఇట్టి కార్యక్రమం జయప్రదం కావడానికి ప్రత్యక్షముగా పరోక్షంగా సహకరించిన వారందరికీ పేరు పేరునా ట్రస్ట్ తరపున మేనేజింగ్ ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు ధన్యవాదాలు తెలియ పరచ్చినారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking