కాశిబుగ్గ ఫిబ్రవరి14 (ప్రజాబలం): వరంగల్ నగరంలో మరో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి సర్వం రంగం సిద్ధం అయ్యింది. ఎన్ ఎస్ ఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో నేషనల్ హైవేకి అనుకొని కొత్తపెట క్రాస్ వద్ద అత్యాధునిక వైద్య పరికరాలతో ఏర్పాటు చేసిన అపోలో రీచ్ ఎన్ఎస్ఆర్ హాస్పటల్ బుధవారం ఉదయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే ఆరూరి రమేష్, అపోలో హాస్పిటల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీత రెడ్డి, ప్రారంభించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను ఎన్ఎస్ఆర్ యాజమాన్యం దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెస్సార్ హాస్పటల్ యాజమాన్యం మాట్లాడుతూ అన్ని రకాల వైద్య సేవలను అందరికీ అందుబాటు ధరలలో అందించేందుకు ఆసుపత్రి నిర్మాణం చేపట్టడం జరిగిందనీ ప్రారంభోత్సవానికి ప్రజలు అందరూ పాల్గొనాలని కోరారు.