పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

 

పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్
భవేష్ మిశ్రా
అధికారులను ఆదేశించారు.
శనివారం సమీకృత కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నిక ఏర్పాట్ల పై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూపాలపల్లి నియోజక వర్గం వ్యాప్తంగా 16 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, 12535 మంది పట్టభద్రుల ఉప ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. ఈ నెల 27 వ తేదీన ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని ఆయన
తెలిపారు. పోలింగ్ కోసం 19 మంది పిఓలు,19 మంది
ఏపీఓ లు, 38 మంది ఒపిఓలు, మైక్రో అబ్సర్వర్స్ 16 మంది, 4 గురు సెక్టార్ అధికారులను నియమించామని అన్నారు. పోలింగ్ సిబ్బందికి బోజన వసతిని ఎంపిడిఓలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామాగ్రిని 26వ తేదిన కలెక్టరేట్ సమావేశపు హాలులో ఉదయం 9 గంటల నుండి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయాలని, పోలింగ్ కేంద్రాలల్లో ఓటర్లకు త్రాగునీరు, టెంట్లు ఏర్పాటు చేయాలని అన్నారు.
పోలింగ్ కేంద్రాల లోపలికి వచ్చే ఓటర్లను నిశితంగా పరిశీలింన తదుపరి పోలింగ్ కేంద్రంలోనికి అనుమతించాలని, ఓటర్లను సెల్ ఫోన్లు, పెన్స్, పెన్సిల్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించవద్దని పేర్కొన్నారు.
పోలింగ్ మొదలయ్యే ముందు బ్యాలెట్ బాక్సు లను పోలింగ్ ఎజెంట్ల సమక్షంలో వీడియో గ్రఫీ చేయాలని తదుపరి సీల్ వేసి పోలింగ్ ప్రారంభించాలని అన్నారు. పోలింగ్ బాక్సులకు పైన, ముందు వైపు పోలింగ్ కేంద్రం నంబర్ కనబడే విధంగా అంటించాలని పటిష్టమైన మూడు తాళం చెవులు కలిగిన తాళ్లాలను పోలింగ్ బాక్సులకు అమర్చాలని తెలిపారు. ఇప్పటివరకు పట్టభద్రుల ఉప ఎన్నికలకు 97 మంది ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ జారీ చేశామని, 96 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారని పేర్కొన్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత ఫాం 16, పి.ఓ డైరీ, డిక్లరేషన్ లను ప్రత్యేకమైన ట్రాంక్ బాక్సులో భద్రపరిచి స్ట్రాంగ్ రూమ్ కు తరలించాలని తెలిపారు.
పోలింగ్ సిబ్బందికి రేపు పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సమయంలో శిక్షణ ఇవ్వడం సకాలంలో హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్డిఓ నరేష్, డిపిఓ నారాయణ రావు, ఆర్డీవో మంగిలాల్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking