పట్టభద్రుల ఎన్నికలలో తీన్మార్ మల్లన్నని గెలిపించండి.

 

డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్

ఖమ్మం ప్రతినిధి మే 25 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కామేపల్లి ఖమ్మం నల్గొండ,వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ అన్నారు రుక్కీతండా గ్రామపంచాయతీ బండిపాడు. రుక్కీతండా రాయి గూడెంలో కొండాయిగూడెం. పండితపురం గ్రామంలో
నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. తీన్మార్ మల్లన్నను మండలికి పంపిస్తే నిరుద్యోగ యువతీ, యువకులకు అండగా నిలబడి సమస్యను పరిష్కార దిశగా ఆలోచించగల దిటైన నాయకత్వం కలిగిన నాయకుడు మన మల్లన్న అని అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో గడిల పరిపాలనకు వ్యతిరేకంగా కెసిఆర్, కేటీఆర్ లను ముచ్చమటలు పట్టించి గడియ తలుపులు బద్దలు కొట్టే విధంగా బిఆర్ఎస్ ప్రభుత్వం పై ఎక్కుపెట్టిన నాయకుడు మన తీన్మార్ మల్లన్న అని అలాంటి నాయకత్వం కలిగిన నాయకుడని చట్టసభలకు పంపించి మన గొంతుకను వినిపించుకుందాం అన్నారుఈ సమావేశంలో జాటోతు రామా. కొప్పుల వెంకటేశ్వర్లు. లాకావత రాములు. గుగులోతురవి .ఓరుగంటి సైదులు. ఉబ్బని రాములు. సిహెచ్ వీరబాబు.పరిమిశెట్టి సాంబయ్య. బానోతు దేవ్ సింగ్. ఓరుగంటే యుగంధర్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking