-తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యధర్శి గోపగాని శంకర్రావు
ఖమ్మం ప్రతినిధి మే 25 (ప్రజాబలం) ఖమ్మం నల్గోండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిజేఎస్ సిపిఎం సిపిఐ బలపర్చిన కాంగ్రెస్ అభ్యర్ది తీన్మార్ మల్లన్న ను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యదిక మేజార్టీతో గెలిపించాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యధర్శి గోపగాని శంకర్రావు పిలుపునిచ్చారు.నిన్న ఖమ్మంలో ఆయన మీడీయాతో మాట్లాడుతూ ప్రశ్నించే గోంతుకగా కేసిఆర్ నియంత ప్రభుత్వం పై పోరాడిన తీన్మార్ ను శాసన మండలి కి పంపించి తెలంగాణ నిరుధ్యోగుల పట్టభద్రుల తరపునా మాట్లాడే అవకాశం ఇవ్వాలని తెలిపారు.తెలంగాణ జన సమితి శ్రేణులు తీన్మార్ మల్లన్న ను గెలిపించేందుకు కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గం నాయకులు బెల్లంకొండ నాగేశ్వరరావు యువజన నాయకులు భట్టు రాజేందర్ నాయక్ ఖమ్మం నగర నాయకులు డేవిడ్ తదితురులు పాల్గోన్నారు.