ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూన్ 03 : నూజివీడు వారి నాణ్యమైన విత్తనాలను రైతులందరు వాడాలని ఏ ఎస్ ఎం రాజబాబు అన్నారు. మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట కింగ్స్ ఫంక్షన్ హాల్ లో రైతు అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగన్న హాజరై మాట్లాడారు.ఈ సందర్భంగా నూజివీడు ఏ ఎస్ ఎం రాజబాబు మాట్లాడుతూ.. రైతుల కోసం విత్తనాలను తయారుచేసి అందిస్తున్న ఏకైక కంపెనీ నూజివీడు అని అన్నారు. నూజివీడు కంపెనీ ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం లో రైతుల పాత్ర కీలకమైనది.రైతులు అధిక దిగుబడిని పొందాలంటే నూజివీడు వారి శ్రీ అన్నపూర్ణ విత్తనాలను వాడి అధిక దిగుబడిని పొందాలని అన్నారు.ప్రభుత్వ గుర్తింపు పొందిన దుకాణాలలో విత్తనాలను కొనుగోలు చేసి రసీదులను పొందాలని రైతులు అవగాహన కలిగి ఉండాలన్నారు. అంతకుముందు డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగన్న మాట్లాడుతూ…రైతులందరు నాసిరకం విత్తనాలను కొని ఇబ్బంది పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులు కొనుగోలు చేసే ప్రతి విత్తనానలకు కచ్చితంగా రసీదు పొందాలని అన్నారు. రైతులందరూ నూతన వ్యవసాయ పద్ధతులను అనుసరించి అధిక దిగుబడి పొందాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు సంతోష్, రాజేష్,వేణుగోపాల్,డీలర్స్,ప్రభాకార్,ప్రశాంత్,పొచన్న, శ్రీనివాస్,రైతులు తదితరులు పాల్గొన్నారు.