ప్రభుత్వ భూములు, సీలింగ్ భూములు అన్నిటిని గుర్తించి గూగుల్ మ్యాప్ తయారు చేయాలి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఫిబ్రవరి 21:
బుధవారం రోజున విసి మీటింగ్ హాల్లో ఆర్డీవోలు, ఎమ్మార్వోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లో ఉన్న సీలింగ్ భూములు అన్నింటిని ధరణిలో క్రయవిక్రయాలు జరగకుండా చూడాలన్నారు. కోర్టుకేసులు పెండింగ్ లో ఉన్నా వాటిని కౌంటర్ ఫైల్ చేయమని తహశీల్దార్లకు ఆదేశించారు. హౌసింగ్ బోర్డ్ ల్యాండ్ లను కాపాడవలసిందిగా కలెక్టర్ కోరారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల యొక్క గూగుల్ మ్యాప్ ను తయారు చేయాలని సంబంధిత అధికారులను కోరారు. ఓ ఆర్ ఆర్ చుట్టూ ఇండస్ట్రియల్ పార్కు స్థాపించడానికి గవర్నమెంట్ పార్సిల్ గుర్తించమన్నారు. మండల పరిధిలోని పెండింగ్ లో ఉన్న టీఎస్ బి పాస్ దరఖాస్తులను పరిశీలించి పంపవలసిందిగా కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, ఆర్డీవో శ్యాంప్రకాష్, మండల తహశీల్దార్ లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking