ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 21 : ఘనంగా కృష్ణావేణి టాలెంట్ స్కూల్ 13 వ వార్షికోత్సవం వేడుకలు నిర్వహించారు. ట్రస్మా మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు.బుధవారం మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ స్థాపించి 13 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా పాఠశాల యాజమాన్యం 13 వ వార్షికోత్సవాన్ని ఎస్ పీ ఆర్ గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అయన హాజరయ్యారు.ఈ సందర్బంగా అయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ…విద్యార్థులు క్రమశిక్షణ కలిగి బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలని తెలియజేశారు.విద్య సంపూర్ణ పౌరునిగా ఎదగడానికి దోహద పడుతుందన్నారు. విలువలతో కూడిన జీవితాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ట్రస్మ వర్కింగ్ ప్రెసిడెంట్ రేగళ్ల ఉపేందర్,కృష్ణవేణి టాలెంట్ స్కూల్ డైరెక్టర్ ఎంబడి రమేష్, పెట్టం తిరుపతి, పేరెంట్స్ కమిటీ ప్రెసిడెంట్ రమేష్ చంద్ జైన్, వైష్ణవి మహిళ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఆకుల కిరణ్, కాంగ్రెస్ నాయకులు చింత అశోక్,బాణాల రమేష్, బొప్పు సతీష్,బియ్యాల తిరుపతి,రాందేని చిన్న వెంకటేష్,పాయిల వేణు, విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.