రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 22 ఫిబ్రవరి 2024:
మణికొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సాయంత్రం అదనపు తరగతులు చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు గోల్డెన్ ఒరియోల్ అపార్ట్మెంట్ వరిష్ఠ నాగరికుల సంఘ సభ్యుడు అయిన సత్యనారాయణ రెడ్డి పెండ్లి రోజు సందర్భంగా పిల్లలందరికీ వీ.ఆర్.ఫర్ సహయోగ్ చారిటబుల్ ట్రస్టు పర్యవేక్షణలో అరటి పండ్ల పంపిణీ చేయడం జరిగినదని ట్రస్ట్ కోశాధికారి దిలీప్ కక్కడ్ తెలియజేస్తూ పిల్లల సేవా కార్యక్రమాన్ని సద్వినియోగ పరచు కొన్న పుణ్య దంపతులు కల కాలం కలసి మెలసి తోడు నీడగా, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖశాంతులతో శత వసంతాలు హాయిగా జీవించాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగినదని, ఈ శుభ ఘడియలలో ట్రస్టు సభ్యులు, పాఠశాల ప్రధాోపాధ్యాయుడు నిరంజన్ తో పాటు గోల్డెన్ ఒరియోల్ అపార్ట్మెంట్ వరిష్ఠ నాగరికుల సంఘ సభ్యులు, అపార్ట్మెంట్ సహచర కుటుంబీకులు, మిత్రులు, బంధువులు, మరియు పాఠశాల ఉపాధ్యాయులందరూ కార్యక్రమంలో పాల్గొన్నారని రాబోయే శనివారం వరకు గోల్డెన్ ఒరియోల్ అపార్ట్మెంట్ వరిష్ఠ నాగరికుల సంఘ సభ్యులు ఈ సేవ కొనసాగిస్తారని తదుపరి సేవకై మణికొండ పురజనులు ముందుకు రావాలని వినమ్ర పూర్వకంగా తెలియ పరచినారు.
