పోలీసు శాఖకు చెడ్డపేరు తీసుకువస్తే సహించేది లేదు : నిర్మల్ జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల పోలీసులు విధుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు.
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..
పోలీసు శాఖకు చెడ్డ పేరు తీసుకువచ్చేవారు ఎంతటి వారైనా సహించేది లేదని జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల.హెచ్చరించారు.పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేసి ఆదర్శంగా నిలవాలని సూచించారు.నిర్మల్ జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు దురుసుగా వ్యవహరించారని హెడ్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.మరియు శాఖ పరమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రజలకు పోలీసులంటే గౌరవం పెరిగేలా కృషి చేయాలి కానీ,ఇలా చెడ్డ పేరు తీసుకురావడం పునరావృతం అయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల హెచ్చరించారు