అఖిల భారత యాదవ మహాసభ సంఘం నూతన కార్యాలయం ప్రారంభోత్సవం

 

జమ్మికుంట ప్రజా బలం ప్రతినిధి జూన్ 28

జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలో అఖిల భారత యాదవ మహాసభ కోరపల్లి గ్రామ నూతన కార్యాలయ భవనాన్ని ఈరోజు గ్రామ శాఖ అధ్యక్షులు బక్కతట్ల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నాగారపు సత్యనారాయణ యాదవ్ మండల అధ్యక్షులు గిరవెన శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్రీ బాషబోయిన మల్లేష్ యాదవ్, గీతాంజలి యాదవ్ లు జిల్లా ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన రవియాదవ్ హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ యాదవ్ మాట్లాడుతూ ఈ గ్రామంలో యాదవుల జనాభా అత్యధికంగా ఉండి సంఘ భవనం లేకపోవడం చాలా బాధాకరం ఇప్పటివరకు మంజూరు అయినా నిర్మాణం కాక ఆగిపోయినటువంటి అనుమతుల విషయంలో జిల్లా కమిటీ తరఫున ప్రత్యేక శ్రద్ధచూపి యాదవ సంఘం సొంత భవనం నిర్మాణం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో యాదవ సంఘం గ్రామ ప్రధాన కార్యదర్శి నరేష్ యాదవ్ ఉపాధ్యక్షులు శంకర్ యాదవ్ కోశాధికారి శ్రీనివాస్ యాదవ్ కార్యదర్శులు కమిటీ సభ్యులు సంఘ సభ్యులు అధిక సంఖ్యలో యాదవులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking