మెదక్ జిల్లాలో ఉన్న ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకొని ” మెతుకు సీమ సత్తా చాటాలని ” జిల్లా సాధారణ పరిశీలకుడు పృధ్వీరాజ్ బీపీ ఐఏఎస్,
100 శాతం ఓటింగే లక్ష్యం — జిల్లా ఎన్నికల అధికారి/ కలెక్టర్ రాజర్షి షా.
మెదక్ ప్రాజబలం నవంబర్ 18 ప్రాజబలం న్యూస్ :-సాధారణ ఎన్నికలు -2023, నర్సాపూర్ నియోజకవర్గం లో VIPER ( Vishnu institute of pharmaceutical education and research center) ( వైపర్ ) నర్సాపూర్ లో శనివారం ఎర్పాటు చేసిన స్వీప్ కార్యక్రమంలో భాగంగా “నేను కచ్చితంగా ఓటు వేస్తాను మీరు కూడా ఓటు వేయండి” అనే కార్యక్రమంలో జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి/ కలెక్టర్ రాజర్షి షా తో పాటు , జిల్లా సాధారణ పరిశీలకుడు పృధ్వీరాజ్ బీపీ , IAS పాల్గొన్నారు .
ఈ సందర్భంగా జిల్లా సాధారణ పరిశీలకుడు పృధ్వీరాజ్ బీపీ , IAS . మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం పండుగ వాతావరణం లో ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. నిష్పక్షపాతoగా, స్వచ్ఛందంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. మెదక్ జిల్లాలో ఉన్న ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకొని మెదక్ జిల్లాలో ఉన్న ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకొని ” మెతుకు సీమ సత్తా ” చాటాలని అన్నారు .
ఎన్నికల రిటర్నింగ్ అధికారి / కలెక్టర్ రాజర్షి షా, మాట్లాడుతూ నవంబర్ 30 నాడు, ఎన్నికల నోటిఫికేషన్ వెలువైనప్పటి నుండి స్వీప్ కార్యక్రమములో భాగంగా , జిల్లాలో అన్ని గ్రామలలో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ ఎల్ సి కమిటీలు, కళాజాత తో అటపాట , రంగోళి పోటీలు , వ్యాసరచన పోటీలు , వంటి అనేక ఓటర్ అవగాహన కార్యక్రమలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
మెదక్ జిల్లాలో 579 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల కమిషన్ గుర్తించిన 13 రకాల గుర్తింపు కార్డులను తమ వెంట తీసుకుని వెళ్లి పోలింగ్ సిబ్బందికి సహకరించాలని కోరారు. 18 సంవత్సరాల నిండి , కొత్తగా ఓటు హక్కు పొందిన ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని సత్తా చాటాల అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు కీలకమని దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు, 40 శాతం అంగవైకల్యం కలిగిన దివ్యాంగులకు భారత ఎన్నికల సంఘం, ఇంటి వద్ద నుండే హోమ్ ఓటింగ్ సౌకర్యం కల్పించిందని, నడవగలిగినవారు పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కును ఉపయోగించు కొవాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పోలింగ్ రోజు ఏక్కడికి వెళ్లకుండా, ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓట్లు వేస్తామని యువఓటర్లతో కలిసి ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో DWO ,అధికారి బ్రహ్మాజీ, CPDO హేమ భార్గవి , డి ఎస్ పి యాదవరెడ్డి , AD మైన్స్&జియాలజి జయరాజ్, జిల్లా సైన్స్ అధికారి రాజి రెడ్డి ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
