కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల తో 10 లక్షలు అందనున్నాయి
చెన్నూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేక్ వెంకట స్వామి
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి నవంబర్ 18 : మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలంలోని రామారావు పేట గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకట స్వామి. శనివారం ఈ సందర్భంగా వివేక్ వెంకట స్వామి మాట్లాడుతూ… 3వ తారీకు ఫలితాలు వస్తున్నాయి 5వ తేదీన కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది,జైపూర్ మండలం లో ఉన్న సమస్యలన్ని విని నోట్ బుక్ లో రాసుకుంటున్న,జైపూర్ మండలంలో పంట నష్ట పోయిన బాధితులకు న్యాయం చేస్తా,జైపూర్ హై వే నుండే చాలా సార్లు పోయే సుమన్ ఒక్కసారైనా ఇటు వైపు రాలేదు, అంతేకాకుండా బాల్క సుమన్ లాగా హామీలు ఇచ్చి పోయే వ్యక్తిని కాదు సమస్యలు తిరుస్తా, అధికారం లేనప్పుడే బోర్ వేల్స్ వేయించి మంచి నీటి సదుపాయం కల్పించిన.బాల్క సుమన్ చెన్నూర్ ప్రజలను డబ్బుకు అమ్ముడు పోయే వాళ్ళు అంటుండు,బీఆర్ఎస్ పార్టీ ఓటుకు 5 వేల రూపాయలు ఇస్తా అంటుంది.అంటే రోజుకు మూడు రూపాయలు,కావాలా,లేదా కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పార్టీ 6 గ్యారెంటీ లతో 10 లక్షలు అందనున్నాయి,అని అన్నారు,ఇంకా బాల్క సుమాన్ ఇంటికి పంపించాలి,అంటే చేతి గుర్తుకు ఓటు వేయాలి అవసరం వుంది,కేసీఆర్ బాల్క సుమన్ కు మీరు అంతా అతనికి బై.బై..చెప్పే సమయం వచ్చింది ప్రజలతో అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు,మండల నాయకులు,కార్యకర్తలు మహిళలు,తదితరులు పాల్గొన్నారు.