జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం కార్యనిర్వాహక సంచాలకులు సి. హెచ్.దుర్గాప్రసాద్
ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గం రిపోర్టర్ సెప్టెంబర్ 13 : షెడ్యూల్డ్ కులాల కార్పొరేషన్ కు సంబంధించి మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండల కేంద్రంలో గల 5 దుకాణాలను నెలవారి అద్దె ప్రాతిపదికన కేటాయించేందుకు షెడ్యూల్డ్ కులముల వారి నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం కార్యనిర్వాహక సంచాలకులు సి.హెచ్.దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.శుక్రవారం అభ్యర్థుల వయసు 21-50 సంవత్సరాల మధ్య ఉండాలని,సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి 1 లక్ష 50 వేల రూపాయలకు మించి ఉండకూడదని,కనీస విద్యార్హత 5వ తరగతి చదువుకుని ఉండాలని తెలిపారు.దరఖాస్తు ఫారంను కార్యాలయ పని వేళలలో ఉచితంగా పొందవచ్చని,కోటపల్లి మండలానికి చెందిన నిరుద్యోగ అభ్యర్థులు ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని ఎఫ్-3 బ్లాక్,మొదటి అంతస్తులోని జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని తెలిపారు.కోటపల్లి మండలానికి చెందిన షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.