జిల్లాలో సెంట్రోల్ డ్రగ్ స్టోర్ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి 13 :
జిల్లాలో ప్రజల సౌకర్యార్థం సెంట్రల్ డ్రగ్ స్టోర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐ.టి.ఐ. కళాశాల సమీపంలో చేపట్టిన మందుల నిల్వ కేంద్రం నిర్మాణ పనులను ఆర్.ఎం.ఓ. శ్రీధర్,ఐ.టి.ఐ. కళాశాల ప్రిన్సిపల్ రమేష్లతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మందుల నిల్వ కేంద్రంలో హైదరాబాద్ నుండి వచ్చిన మందులను నిల్వ చేయడం జరుగుతుందని తెలిపారు.మందుల నిల్వ కేంద్రం నుండి మంచిర్యాల, బెల్లంపల్లి,లక్షెట్టిపేట, చెన్నూర్ లలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆర్యోగ కేంద్రాలకు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.ఇంతకు ముందు ఆదిలాబాద్ జిల్లా నుండి మందులు సరఫరా జరిగేదని, ప్రజల సౌకర్యార్థం స్థానికంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.

Leave A Reply

Your email address will not be published.

Breaking