ఘనంగా గణపతి కుంకుమ పూజలు

 

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి సెప్టెంబర్ 13

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో కల వినాయక సేవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపంలో మహిళా మణులు ఘనంగా కుంకుమ పూజలు నిర్వహించారు.వినాయక సేవ సమితి ఆధ్వర్యంలో ప్రతిఏటా గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి వివిధ రకాల పూజ కార్యక్రమాలను నిర్వహించి ప్రాణికోటి సుభిక్షంగా ఉండాలని వానలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు పండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మహిళా మణులు కుంకుమ పూజలు నిర్వహించి ఆ బొజ్జ గణపయ్యను వేడుకున్నారు ఈ కార్యక్రమంలో వినాయక సేవా సమితి నిర్వాహకులతో పాటు మహిళా మణులు ,భక్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking