జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి సెప్టెంబర్ 13
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) కరీంనగర్ జిల్లా నాలుగో మహాసభలను జయప్రదం చేయాలని హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు సౌడమల యోహాన్ అయిత రాధాకృష్ణ అన్నారు. జమ్మికుంట ప్రెస్ కప్ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో ప్రెస్ క్లబ్ జిల్లా నాలుగో మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహాసభలకు హుజురాబాద్ నియోజకవర్గం లోని వర్కింగ్ జర్నలిస్టులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. మహాసభల్లో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పైన సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్తు కార్యచరణను రూపొందించుకుంటామని తెలిపారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్లు ఇళ్ల స్థలాలు హెల్త్ కార్డులు రైల్వే పాస్ లను పునరుద్ధరించాలని వారు తెలిపారు. ఈ సమావేశంలో యూనియన్ ఉపాధ్యక్షులు ఏబిసి సంపత్ సహాయ కార్యదర్శి ఎండి ఖాజా ఖాన్, కోశాధికారి దయ్యాల సుధాకర్ కమిటీ సభ్యులు రచ్చ రవికృష్ణ పాల్గొన్నారు.