గంగమ్మకు పూజలు చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ మామిండ్ల జ్యోతి కృష్ణ,మత్స్యశాఖ డైరెక్టర్ గడప దేవేందర్,పాలకవర్గ సభ్యులు.
తూప్రాన్ ప్రాజబలం సెప్టెంబర్ 5 న్యూస్ :-
మెదక్ జిల్ల తూప్రాన్ పట్టణంలోని గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తూప్రాన్ పెద్ద చెరువులోకి భారీగా వరద నీరు చేరడంతో గురువారం ఉదయం అలుగెల్లింది.తూప్రాన్ పెద్ద చెరువు అలుగు పారడంతో పట్టణ వాసులు సంతోషం వ్యక్తం చేస్తూ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు మత్స్యశాఖ డైరెక్టర్ గడప దేవేందర్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం మున్సిపల్ చైర్ పర్సన్ మామిండ్ల జ్యోతి కృష్ణ సమక్షంలో గంగమ్మకు హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా
తూప్రాన్ మున్సిపాలిటీ కేంద్రంలో పెద్ద చెరువు కట్ట నిండి చెరువు ఆలుగు పారడంపై హర్షం వ్యక్తం చేసిన తూప్రాన్ మున్సిపల్ చైర్ పర్సన్ మామిoడ్ల జ్యోతి కృష్ణ ముదిరాజ్, వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్,మత్స్యశాఖ డైరెక్టర్ గడప దేవేందర్ ,కౌన్సిలర్ శ్రీశైలం గౌడ్,భగవాన్ రెడ్డిలతో పాటు కౌన్సిల్ పాలకవర్గం సభ్యులు తూప్రాన్ పెద్ద చెరువు కట్టపై ఉన్న గంగమ్మ గుడిలో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు.తదనంతరం గంగమ్మ తల్లికి చీరను సమర్పించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మామిళ్ల జ్యోతి కృష్ణ,వైస్ చైర్మన్,మత్స్యశాఖ డైరెక్టర్ గడప దేవేందర్,కౌన్సిలర్ శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ పెద్ద చెరువు అలుగు పారడం సంతోషంగా ఉందని,చెరువు నిండడం వల్ల మత్స్యసంపద పెరగడమే కాకుండా సంవత్సరానికి రెండు పంటలు సమృద్ధిగా పండుతాయన్నారు.
తూప్రాన్ ప్రజలకు ఎంతో ఆహ్లాదంగాకారoగా ఉంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తూప్రాన్ పట్టణ అధ్యక్షులు పల్లెర్ల రవీందర్ గుప్తా,
గరిగే నర్సింగరావు,మహమ్మద్ అప్సర్ ,సోము యాదగిరి,బుడ్డ భాగ్యరాజ్, నాగరాజ్ గౌడ్ చెలిమెల రఘుపతి మండల ఆర్ఎంపీ పిఏంపిల అసోసియేషన్ అధ్యక్షులు మహ్మద్ అప్సర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బుడ్డ భాగ్యరాజ్,దుర్గం నాగేష్,సత్యనారాయణ,శ్రీనివాస్,నాగరాజ్ ఉమర్,అనిల్,దామోదర్ రెడ్డి , అజార్,నర్సింలు
సమీర్,జింక మల్లేశం, ఊష్ణుబాయ్,దేవేందర్ రెడ్డి,సత్యనారాయణ,
షరీఫ్ బాయ్, రమేష్, పుర ప్రముఖులు,మున్సిపల్ సిబ్బంది ఇర్ఫాన్,వినోద్ పట్టణ ప్రజలు,ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.