ప్రజాబలం ప్రతినిధి తార్నాక సెప్టెంబర్ 5:
డా॥ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని తార్నాక నారాయణ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. రాధకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం
విద్యార్థులు ఉపాధ్యాయులను సన్మానించి తమ అభిమానాన్ని తెలియ చేసారు. ఈ సందర్భంగా
ప్రిన్సిపల్ వెంకటేష్ మాట్లాడుతూ ప్రతీ ఉపాధ్యాయుడు విద్యార్థుల ప్రగతికి కారకూడన్నారు. విద్యార్థులందరూ ఎంతో కష్టపడి చదివి, వారి తల్లితండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి
పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎ.జి.ఎం. బాల పరమేశ్వర్, అకాడెమిక్ డీన్ శశిధర్, ఎ.ఓ.యోగి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు
Next Post