జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి సెప్టెంబర్ 5
జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల 2024-25 సంవత్సరానికి తెలుగు, బాటని, క్రాప్ ప్రొడక్షన్, డైరీ సైన్స్ సబ్జెక్టులు బోధించుటకు అతిథి అధ్యాపకుల (గెస్ట్ ఫ్యాకల్టీ) నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ బి. రమేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీజీలో సంబంధిత సబ్జెక్టులో ఓసి, బిసి అభ్యర్థులు 55 శాతం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు. పీహెచ్ డి, నెట్, సెట్ అర్హతలు కలిగిన వారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు బయోడేటా విద్యాఅర్హతలతో ఈ నెల 9వ తేదీ సాయంత్రం 4.00వరకు కళాశాల కర్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని పేర్కొన్నారు.