పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

సంగారెడ్డి నియోజవర్గ ప్రతినిధి ఏప్రిల్ 15(ప్రజాబలం)సంగారెడ్డి జిల్లా/సదాశివపేట:ఆదివారం నాడు సదాశివపేట మండల పరిధిలోని నిజంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2000-2001 సంవత్సరం పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది,25 సంవత్సరాల తరువాత కలిసిన మిత్రుల యోగ క్షేమాలను అడిగి తెలుసుకొని చిన్నానాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆనాటి గురువులను ఘనంగా సన్మానించారు. పూర్వ విద్యార్థులు 25 ఏళ్ల అనంతరం ఆదివారం కలుసుకొని ఆత్మీయత పంచుకున్నారు,అప్పటి స్నేహితులు అందర్నీ కలిసి వారితో ముచ్చటిస్తూ అలనాటి జ్ఞాపకాలు నెమరువేసుకుంటుంటే.. ఆ అనుభూతి వర్ణణాతీతం,అందుకే ఇప్పుడు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పేరుతో బాల్య మిత్రులు, ఒకే చోట చదువుకున్న వ్యక్తులు కలసి గెట్ టూ గెదర్‌లలు ఏర్పాటు చేసుకుంటున్నారు. తాజాగా అలాగే 10వ తరగతి వరకూ కలిసి చదువుకున్న విద్యార్థులు అందరూ పాతికేళ్ల తరువాత కలుసుకున్నారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఆనాటి మధురస్మృతులు గుర్తుచేసుకున్నారు. తమ భవిష్యత్తును తీర్చిదిద్దిన గురువులను సత్కరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking