ఈసోజిపేట గ్రామంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

 

 

ఆందోల్ నియోజకవర్గం ప్రతినిధి
ఏప్రిల్ 15, ( ప్రజాబలం ) సంగారెడ్డి జిల్లా,ఉమ్మడి పుల్కల్ మండల పరిధిలో గల ఇసోజిపేట గ్రామంలో (పి ఏ సి ఎస్) ద్వారా వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేసిన, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు, మున్నూరు మాణిక్యం, మాట్లాడుతూ, రైతుల యొక్క వరి ధాన్యం చివరి దశలో ఉందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగవద్దని, ముందస్తుగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం, వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తుందని తెలిపారు, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం విక్రయించుకోవాలని సూచించారు, ఏ గ్రేడ్ రకం 2,320, రూపాయలు, రెండవ రకం బి గ్రేడ్,2,300 రూపాయలు, ప్రభుత్వం చెల్లిస్తుందని, సన్నబడ్లకు 500 రూపాయలు బోనస్ కలిపి,2,820 రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు, రైతులు వారి యొక్క ధాన్యాన్నికేంద్రాల్లోనే అమ్ముకోవాలని తెలిపారు రైతులకు ప్రభుత్వం వడ్ల డబ్బులను వారం లోపట వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు, గత ప్రభుత్వం హయాంలో పంట పండించిన తర్వాత కూడా ధాన్యం కొనుగోలు చేయక రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు, కానీ ఈ ప్రభుత్వం రైతుల యొక్క శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని, ముందుగా వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంజరుగుతుందని, ఇది రైతు ప్రభుత్వం అని తెలిపారు, ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తుందని, కాబట్టి రైతులు కూడా వచ్చే వర్షాకాలం సీజన్లో సన్న వడ్లను పండించి, ఈ ప్రజా ప్రభుత్వానికి సహకరించాలని, రైతులకు ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మున్నూరు మాణిక్యం అన్నారు, ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి నాయిని రవికుమార్, మాజీ సర్పంచి చర్ల దశరథ్ రెడ్డి, గ్రామ మాజీ ఉపాధ్యక్షుడు శివనోళ్ల గణపతి, సీనియర్ నాయకులు బోతిరెడ్డి గారి నారాయణరెడ్డి, నాయకులు గొల్ల వెంకటేశం, చాంద్ పాషా, మైబుసాబ్, మాజీ ఆయకట్టు చైర్మన్ చింతలపల్లి భూమయ్య, పార్టీ కార్యకర్తలు గ్రామ రైతులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking